AP: విశాఖలోని షీలా నగర్ జంక్షన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి తల నుజ్జునుజ్జు అవ్వడంతో అతడిని గుర్తించడం కష్టంగా మారింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.