గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 2లో అక్టోబర్ 27న ఒక డ్రైవర్ అతివేగంగా కారును రివర్స్‌లో నడుపుతూ అక్కడే నడుస్తున్న మహిళను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడి, రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడా లేక నియంత్రణ కోల్పోయాడా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.