పోలీసుల కళ్లెదుటే కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య

24చూసినవారు
పోలీసుల కళ్లెదుటే కారుతో ఢీకొట్టి వ్యక్తి హత్య
AP: కృష్ణా జిల్లా బాపులపాడు(M) హనుమాన్ జంక్షన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. క్రాంతి కిరణ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రామినేని రామకృష్ణ కారుతో వేగంగా అతడిని ఢీకొట్టారు. ఈ ఘటన పోలీసుల కళ్లెదుటే జరగడం గమనార్హం. ఈ దాడిలో కిరణ్ అక్కడికక్కడే చనిపోయారు. పాత గొడవలే కిరణ్ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్