బుర్ఖా ధరించనందుకు భార్య, పిల్లలను చంపిన వ్యక్తి

231చూసినవారు
బుర్ఖా ధరించనందుకు భార్య, పిల్లలను చంపిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య బుర్ఖా ధరించలేదని మహమ్మద్ ఫరూఖ్ అనే వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు మైనర్ కూతుర్లను కాల్చి చంపాడు. అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోనే 9 అడుగుల లోతు గొయ్యిలో పూడ్చిపెట్టాడు. అయితే ఇటీవల డబ్బు విషయంలో భార్యతో గొడవపడి, బుర్ఖా ధరించకుండా పిల్లలతో పుట్టింటికి వెళ్లిన ఆమెను అవమానంగా భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్