ఓ భర్త అత్యంత క్రూరంగా భార్యను హతమార్చాడు. బెంగళూరులోని అత్తిబెలె ప్రాంతానికి చెందిన విద్య (37), బసవరాజు దంపతులకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఎవరికీ అనుమానం రాకుండా భార్యను చంపాలని బసవరాజు ప్లాన్ చేశాడు. భార్యకు క్లోరోఫాం ఇచ్చి మత్తులోకి జారుకున్నాక పాదరసం ఇంజెక్షన్ చేశాడు. ఒక్కొక్క అవయవం పాడై.. 9 నెలలు నరకం అనుభవించిన తర్వాత ఆమె చనిపోయింది. మరణానికి ముందు విద్య పోలీసులకు వీడియో ద్వారా వాంగ్మూలం ఇచ్చింది.