AP: అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో హత్యకు గురైన వరప్రకాశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ బి.మోహన్ రావు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దొంగ నోట్ల వ్యాపారంలో వరప్రకాశ్‌తో పాటు మరో ముగ్గురు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో అందులో 2.50 లక్షలు ఇవ్వాలని వరప్రకాశ్‌ను మరో ముగ్గురు అడిగారన్నారు. అతను డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ నెల 19న హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.