ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో వ్యక్తి హత్య.. ఎనిమిది మంది అరెస్ట్

19చూసినవారు
ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో వ్యక్తి హత్య.. ఎనిమిది మంది అరెస్ట్
మొబైల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో బ్యాగరి రామానుజం అనే వ్యక్తిపై ఎనిమిది మంది మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. వినాయక చవితి అన్నదానంలో ఫోన్ పోవడంతో, ‘ఫైండ్ మై డివైస్’ యాప్ లొకేషన్ ఆధారంగా రామానుజం పొలంలో ఫోన్ లభించింది. దీంతో అనుమానంతో గుండెని ప్రవీణ్, అతని అనుచరులు అర్ధరాత్రి కర్రలతో దాడి చేసి రామానుజాన్ని చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 మంది నిందితులను (ఒక మైనర్‌తో సహా) అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్