పెరూ దేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌పై తల పెట్టి పడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన రైలు అతనిపై నుంచి వెళ్ళినా అతను సురక్షితంగా బయటపడ్డాడు. రైలు వెళ్లిపోయిన తర్వాత కూడా అతను ఏమీ జరగనట్టు లేచి కూర్చున్నాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.