గాల్లో ఉండగానే విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి దూకబోయిన వ్యక్తి!

50చూసినవారు
ప్యూర్టో రికో నుంచి చికాగో వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకొని బంధించారు. ఈ సంఘటనతో పైలట్లు విమానాన్ని మయామి ఎయిర్పోర్ట్‌కు మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్