మధ్యప్రదేశ్ బర్వానీ జిల్లాలో పండ్ల వ్యాపారి ఇక్బాల్ ఖాన్ ఆపిల్స్‌పై మురికి మురుగు నీటిని చల్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రజలు ఆగ్రహానికి గురై అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇక్బాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ చర్య ప్రజారోగ్యానికి హానికరమని అధికారులు తెలిపారు. నిందితుడికి లైసెన్స్ లేకపోవడంతో ఆహార భద్రతా చట్టం కింద కేసు నమోదైంది.