
ఆహారం వృథా.. స్కూళ్లలో ఈ టెక్నాలజీని వాడి! (వీడియో)
ఆహార వృథాను తగ్గించేందుకు చైనా పాఠశాలల్లో అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు మిగిల్చిన ఆహారాన్ని ప్రత్యేక యంత్రాల ద్వారా ప్రాసెస్ చేసి, దాని నుండి నూనెను తీసి బయోడీజిల్‌గా మారుస్తున్నారు. మిగిలిన వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా వాటిని పునర్వినియోగించుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా వ్యర్థాలను వనరులుగా మార్చుతూ చైనా పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి రీసైక్లింగ్ యంత్రాలు భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.




