TG: భార్య, పిల్లలను చంపిన కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2019లో భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కేసులో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి కోర్టు ఈ శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. వికారాబాద్‌లో భార్యాపిల్లలతో కలిసి ప్రవీణ్ 32) నివాసం ఉండేవాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను రాడ్‌తో కొట్టి చంపాడు. కుమార్తెను, కుమారుడిని కూడా హతమార్చాడు. ఈ హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కానీ నేరం రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష విధించింది.