TG: ఒంటికి నిప్పంటించుకున్న ఓ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుళ్లు సమస్పూర్తితో కాపాడారు. డయల్100కు అత్యవసర కాల్ రావడంతో మడికొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సంతోష్, గోవర్ధన్ వెంటనే స్పందించారు. ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడని సమాచారం అందడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్షించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి తక్షణ సహాయం అందించి, ఉన్నతాధికారుల సమన్వయంతో వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.