అనుమానంతో భార్యను గొంతు కోసి చంపాడు

174చూసినవారు
అనుమానంతో భార్యను గొంతు కోసి చంపాడు
బెంగళూరులోని గంగమ్మ లేఅవుట్‌లో వివాహేతర సంబంధం అనుమానంతో భర్త తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. కూరగాయల దుకాణంలో పనిచేసే అంజలి (20) హత్యకు గురైంది. అంజలికి ఇది రెండో వివాహం కాగా, కేవలం రెండు నెలల క్రితమే బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న రవిచంద్రను పెళ్లి చేసుకుంది. తన భార్యపై అనుమానంతోనే రవిచంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడైన భర్త రవిచంద్రను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్