ట్రక్కు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డాడు(వీడియో)

0చూసినవారు
యూపీలోని ఝాన్సీలో ఓ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ముందు ఆగి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఫాస్టాగ్ స్కాన్ చేస్తున్న టోల్ ఉద్యోగిని కారు ఢీకొనడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. CCTVలో రికార్డైన ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.