మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారా.. మిమ్మల్ని గమనిస్తున్నాం: హైదరాబాద్ పోలీసులు (వీడియో)

11229చూసినవారు
రద్దీ ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళను అనుచితంగా తాకుతున్న వీడియోను హైదరాబాద్ పోలీసులు షేర్ చేశారు. 'మీరు మహిళలతో ఎక్కడ తప్పుగా ప్రవర్తించినా, షీ టీమ్ నిఘా కెమెరాలు మీ కదలికల్ని గమనిస్తూ ఉంటాయి. మీరు జైలు పాలవకుండా కాపాడే ఏకైక మంత్రం మీ దురుద్దేశాలను చంపుకోవడమే," అని పేర్కొన్నారు. గడిచిన 7 రోజుల్లో ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 285 మందిని షీ టీమ్స్ పట్టుకుంది.

సంబంధిత పోస్ట్