ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. ఓ బస్సు పక్కన నుంచి ప్రమోద్(50) అనే వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో మరో బస్సు రైట్ టర్న్ తీసుకోవడంతో.. రెండు బస్సుల మధ్య చిక్కుకున్న్నాడు. వెంటనే స్థానికులు గమనించి డ్రైవర్‌ని అప్రమత్తం చేయడంతో బస్సుని రివర్స్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమోద్ స్వల్పంగా గాయపడ్డాడు.