ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ సంభవించి భారీ విధ్వంసం సృష్టించింది. డెహ్రాడూన్‌లో మెరుపు వరదలతో సహస్త్రధార ప్రాంతం అతలాకుతలమైంది. నందా పోస్టు సమీపంలో టాన్స్ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రవాహంలో చిక్కుకుపోయాడు. గంటల తరబడి కరెంట్ పోల్‌పై వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో కనిపించడం స్థానికులను కలవరపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.