
గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని షాబేరి ఫర్నిచర్ మార్కెట్లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్లోని దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, వేగంగా పక్కపక్కనే ఉన్న షాపులకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




