భూమి వివాదంలో తండ్రీకొడుకులకు జీవిత ఖైదు !

1406చూసినవారు
భూమి వివాదంలో తండ్రీకొడుకులకు జీవిత ఖైదు !
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఎకరం భూమి వివాదంలో వనోలే ఈశ్వరరావును హత్య చేసిన కేసులో తండ్రీకొడుకులు వనోలే సూర్యకాంత్, వనోలే పాండురంగలకు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున రూ.2 వేల జరిమానా కూడా విధించారు. 26 డిసెంబర్ 2023న జరిగిన ఈ హత్య కేసులో, బాధితుడి భార్య వనోలే కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. పీపీ రహీమ్ సమర్థవంతంగా వాదించి నేరాన్ని రుజువు చేశారు.

సంబంధిత పోస్ట్