వైద్య ఆరోగ్యశాఖ అధికారిని అనిత క్షేత్రస్థాయి పర్యటన

557చూసినవారు
వైద్య ఆరోగ్యశాఖ అధికారిని అనిత క్షేత్రస్థాయి పర్యటన
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత గారు 27.04.2026 సోమవారం నాడు భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం, మరియు చెన్నూరులో నిర్మిస్తున్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులు, అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. చెన్నూరులో వైద్య సేవలపై, చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమన్వయం చేసుకుంటూ కేసులను చెన్నూరు కేంద్రానికి పంపాలని ఆదేశించారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్, క్యాచ్అప్ ప్రచార కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు. చెన్నూరు పట్టణంలోని మారుమూల, వలస ప్రాంతాల ప్రజలకు క్యాచ్అప్ కార్యక్రమం గురించి తెలియజేసి, వ్యాక్సినేషన్ ఇప్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్