నదిలో మొసళ్ల సంచారం..!

490చూసినవారు
నదిలో మొసళ్ల సంచారం..!
మంగళవారం కౌటాల మండలం విర్దండి గ్రామ శివారులోని నదిలో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విర్దండి నుంచి గుండాయిపేట, తుమ్డిహట్టి వరకు, ప్రాణహిత నది కలిసే ప్రాంతం వరకూ దాదాపు 20 మొసళ్లు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. రాత్రిపూట చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రమాదం పొంచి ఉందని, అటవీ శాఖ అధికారులు మొసళ్ల సంచార ప్రాంతాలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్