కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు నవంబర్ 28న ద్వారకానగర్‌లో ముసలమ్మను బెదిరించి బంగారు గొలుసు, ఐదు ఉంగరాలు, ₹10,000 నగదు దోచుకున్న కేసును వేగంగా ఛేదించారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. వేముల బాలకృష్ణ, బండి నీలేష్, పోగుల తిరుపతి అరెస్ట్ కాగా, దూల రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. 11 గ్రాముల గొలుసు, 6 గ్రాముల ఐదు ఉంగరాలు, నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ చేసి జైలుకు తరలించారు.