
ఘనంగా మాజీ జడ్పీటీసీ కూతురి జన్మదిన వేడుకలు
బెల్లంపల్లిలో వేమనపల్లి మండల మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ కూతురు స్మృతి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్మృతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోకల రామచంద్రం, ఉప సర్పంచ్ మంచర్ల సునీత, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దొబ్బల సంతోష్, గణపురం సంతోష్, వార్డు సభ్యులు తోకల శ్రీనివాస్, దుర్గం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



































