బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 356 నామినేషన్లు దాఖలయ్యాయని మున్సిపల్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంపత్ రెడ్డి తెలిపారు. మొదటి రోజు 10, రెండవ రోజు 87, మూడవ రోజు 259 నామినేషన్లు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు.