కన్నెపల్లిలో రోడ్ల దుస్థితిపై ఆటో యూనియన్ల ధర్నా

0చూసినవారు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలో రోడ్ల దుస్థితిపై ఆటో యూనియన్ సంఘాలు ధర్నా నిర్వహించాయి. రోడ్లపై గుంతలు, పిచ్చి మొక్కలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేసి రహదారిని వెడల్పు చేయాలని జిల్లా అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ డిమాండ్ చేశారు. టి.ఆర్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి మాట్లాడుతూ, “ఎన్నికల తర్వాత హామీలు మరిచిపోయారు, గజానికో గుంతగా మారిన రోడ్లు ప్రజలకు ప్రమాదంగా మారాయి” అని అన్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్