శుక్రవారం బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కలకలం రేగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కోనేరులో స్నానం చేసేందుకు సిద్ధమవ్వగా, ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ప్రాణరక్షణ కోసం భక్తులు కోనేరు నీటిలో మునిగి తలదాచుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న తేనెటీగల బెడదను తొలగించి, భక్తులకు రక్షణ కల్పించాలని అధికారులు కోరారు.