బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 740 కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేష్ తెలిపారు. రాజీకి వచ్చే అన్ని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.