బెల్లంపల్లి: స్వర్ణకార సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

0చూసినవారు
బెల్లంపల్లి: స్వర్ణకార సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
బెల్లంపల్లి పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిసి తమ సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జీవో 272 సవరించి, దొంగ బంగారం రికవరీ నుంచి స్వర్ణకారులకు రక్షణ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే, 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకార వృత్తిదారులకు గీత, నేత కార్మికులకు ఇస్తున్న విధంగా నెలకు 5000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్