బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయం ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ మృతిపై ఎంపీడీవో మహేందర్ సంతాపం తెలిపారు. భార్గవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై గురువారం ఆయన వివరణ ఇచ్చారు. భార్గవ్ అంత్యక్రియలకు వెళితే భౌతికదాడులకు దిగుతారని భయపడి వెళ్లలేదని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా భార్గవ్ తో పాటు ఇతర సిబ్బందికి మెమో జారీ చేసినట్లు చెప్పారు. ఐదుగురి బండారం బయటపెట్టినందుకు తనను బదనాం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.