బెల్లంపల్లి మండలం చిన్న బూదలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మళ్లీ కెసిఆర్ సీఎం కావాలని గ్రామస్తులు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.