స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బ్రాంచి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాలను డీసీపీ భాస్కర్ తో కలిసి ఆయన పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు.