బెల్లంపల్లి: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

50చూసినవారు
బెల్లంపల్లి: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ఈ నెల 27 నా వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశాన్ని విజయవంతం చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. ఈ మేరకు బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి 3, 000 మంది ని సమావేశానికి తరలించేందుకు నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్