బెల్లంపల్లి: ఇస్తా రీతిన పార్కింగ్ తో బస్సులకు ఇబ్బందులు

774చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో దుకాణాల ముందు ఇష్టారీతిన వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల స్కూల్ బస్సులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణ మందిర్ రోడ్డు, పాత రామ టాకీస్ రోడ్డు వంటి ప్రాంతాలలో సాయంత్రం పాఠశాలల నుండి పిల్లలను తీసుకువచ్చే సమయంలో వాహనాల అడ్డంకితో బస్సులు నిలిచిపోతున్నాయి. తాజాగా బుధవారం పాత రామ టాకీస్ లైన్ లో వెళ్తున్న స్కూల్ బస్సు మెయిన్ బజార్ లో కొన్ని నిమిషాల పాటు నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :