రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. అభ్యర్థులు తమ మద్దతుదారులతో నామినేషన్ కేంద్రాలకు తరలిరావడంతో సందడి నెలకొంది. అధికారులు అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారని, ఎన్నికల సూచనల మేరకు నామినేషన్ల కోసం ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారని తెలిపారు.