బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శనివారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జెండాను ఆవిష్కరించారు. గత 56 సంవత్సరాలుగా కార్మిక వర్గ హక్కుల కోసం తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కోడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.