బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయ కార్మికులు బుధవారం నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కుదించి, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ నాలుగు కోడ్‌లను తెచ్చారని కార్మికులు ఆరోపించారు.