హిందూ దేవీదేవతలను కించపరిచారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కొత్త బస్టాండ్ చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు 'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొయ్యల ఎమాజీ, కళ్యాణి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.