బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీకి చెందిన కొండు అనిల్ అనే లబ్ధిదారుడికి రూ. 60 వేల విలువైన సీఎం ఆర్ ఎఫ్ చెక్కును స్థానిక సర్పంచ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, నిరుపేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఒక వరమని, ఆర్థికంగా కుంగిపోకుండా ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.