బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను గురువారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కాసిపేట, ఇతర మండలాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అరుణాచల ఈశ్వరుడి ప్రసాదం ఆయనకు అందించారు. మంత్రి పదవి రావాలని పూజలు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.