మంచిర్యాల జిల్లా కోర్టుల ఆధ్వర్యంలో శనివారం 2026 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ముఖేష్ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షిటిపేట, చెన్నూర్ కోర్టులకు చెందిన క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. సాయంత్రం ముగియనున్న ఈ పోటీలను జిల్లా జడ్జి వీరయ్య బహుమతి ప్రధానోత్సవం చేయనున్నారు.