తొలకరి వర్షాలకు తొందరపడి పత్తి విత్తనాలను విత్తుకోవద్దని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నేలలో కనీసం తేమ కూడా రాలేదని పేర్కొన్నారు. పంటల సాగుకు సమయం మించి పోలేదని, జూలై 15 వరకు పత్తి విత్తుకోవచ్చు అని ఆయన వెల్లడించారు.