బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో అంబేద్కర్ రడగంబాల బస్తికి చెందిన కుచాడి శ్రవణ్ రావుకు ఏడాది జైలు శిక్షతోపాటు 1000 రూపాయల జరిమానా ను జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ మంగళవారం విధించినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపారు. శ్రవణ్ రావు టాటా ఏసీ వాహనాన్ని అతీ వేగంగా నడిపి బైక్ పై వెళ్తున్న లక్ష్మీనారాయణ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు.