బెల్లంపల్లి: బుగ్గ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

1చూసినవారు
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె ఆలయాన్ని సందర్శించి, మొక్కలు నాటారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, బుగ్గ ఆలయానికి ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు.