బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద ఆదివారం అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిరుపేదలు, బాటసారులు, చిరు వ్యాపారులు, యాచకులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో బ్రాంచ్ మేనేజర్ మధుకర్, సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.