బెల్లంపల్లి పట్టణంలోని రెండు వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు పోలు ఉమాదేవి, కింశెట్టి సరితలు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పలువురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన తెలిపారు.