బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ లో హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిష్కరించారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని తెలుసుకున్న ఆయన, వ్యాపారులతో చర్చించి, మున్సిపల్ కమిషనర్ సమక్షంలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపారు. ఈ చర్యతో మార్కెట్ లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.