బెల్లంపల్లి: భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

64చూసినవారు
బెల్లంపల్లి: భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
బెల్లంపల్లి మండలం బూదకలాన్ గ్రామ శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా భక్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం, మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్