గురువారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డు మహమ్మద్ ఖాసిం బస్తీలో అకాల వర్షం కారణంగా కూలిన సోమయ్య ఇంటిని మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు పరిశీలించారు. ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు బాధితుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపిఓ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, కమిటీ సభ్యులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.