బెల్లంపల్లి: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు

960చూసినవారు
బెల్లంపల్లి: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24, 25 వార్డుల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు శనివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్